సురేశ్ ప్రొడక్షన్స్ లో నాగచైతన్య మూవీ
- వరుస సినిమాలతో చైతూ
- రీసెంట్ గా కథ వినిపించిన బాబీ
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సురేశ్ బాబు
గతంలో ఒకటి రెండు మార్లు ప్రయత్నాలు జరిగినా, ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు. త్వరలో సురేశ్ ప్రొడక్షన్స్ లో చైతూ ఒక సినిమా చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా దర్శకుడు బాబీ .. చైతూను కలిసి ఒక కథ వినిపించాడట. కథలోని కొత్తదనం సురేశ్ బాబుకి కూడా నచ్చిందని సమాచారం. అందువలన ఈ సినిమా సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.