నయనతార 'కర్తవ్యం' టీజర్ అదిరింది!
- తమిళంలో హిట్ కొట్టిన 'ఆరాం'
- 'కర్తవ్యం' పేరుతో తెలుగులోకి
- ఈ నెల 16వ తేదీన విడుదల
అలాంటి ఈ సినిమాను'కర్తవ్యం' పేరుతో తెలుగులో ఈ నెల 16వ తేదీన విడుదల చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి సంబంధించిన టీజర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని .. వాళ్ల ఆవేదనను అర్థం చేసుకుని .. వాళ్ల తరఫున పోరాడే మనసున్న కలెక్టర్ గా ఈ టీజర్ లో నయనతార కనిపిస్తోంది. "ప్రజలకి ఏది అవసరమో అదే చట్టమవ్వాలి గానీ .. చట్టాన్ని ముందే తయారు చేసి దాన్ని ప్రజల మీద రుద్దకూడదు" అంటూ నయనతార చెప్పే డైలాగ్ ఆకట్టుకునేదిలా వుంది. నిర్మాత శరత్ మరార్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండటం విశేషం.