నిఖిల్ న్యూ మూవీ టైటిల్ ఇదేనట!
- నిఖిల్ హీరోగా 'కనితన్' రీమేక్
- దర్శకుడిగా సంతోష్
- రిజిష్టర్ చేయించిన టైటిల్ గా 'ముద్ర'
ఈ సినిమా నిర్మాత ఠాగూర్ మధు, తాజాగా 'ముద్ర' అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించారు. దాంతో ఈ సినిమాకి ఈ టైటిల్ ఖరారైనట్టేనని అంటున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో 'అర్జున్' అనే పాత్రలో నిఖిల్ కనిపిస్తాడట. ఆయన పాత్ర వెరైటీగా మలచబడిందని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కేథరిన్ .. రష్మిక మందన .. మేఘ ఆకాశ్ పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.