'సవ్యసాచి' ఫస్టులుక్ కి .. రిలీజ్ కి ముహూర్తం కుదిరింది
- చైతూ హీరోగా 'సవ్యసాచి'
- కథానాయికగా నిధి అగర్వాల్
- మార్చి 18న ఫస్టులుక్
- జూన్14వ తేదీన సినిమా రిలీజ్
తమిళ స్టార్ హీరో మాధవన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తూ ఉండటంతో , చైతూ వదిన పాత్రలో భూమిక నటిస్తోంది. కీరవాణి అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. గతంలో చందూ మొండేటి .. చైతూ కాంబినేషన్లో వచ్చిన 'ప్రేమమ్' సినిమా ఘన విజయాన్ని సాధించింది. దాంతో సహజంగానే 'సవ్యసాచి'పై భారీగానే అంచనాలు వున్నాయి. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని చైతూ భావిస్తున్నాడు. ఇక నిధి అగర్వాల్ కి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.