'దండుపాళ్యం 4' నుంచి ఫస్టులుక్ పోస్టర్స్ రిలీజ్
- ఆదరణ పొందిన 'దండుపాళ్యం'
- ఆ తరువాత వచ్చిన 2 .. 3 భాగాలు
- త్వరలో ప్రేక్షకుల ముందుకు 4వ భాగం
తాజాగా 'దండుపాళ్యం 4' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. మొదటి 3 భాగాలకు శ్రీనివాస రాజు దర్శకత్వం వహించగా, 4వ భాగానికి కె.టి. నాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్స్ ను వదిలారు. పోస్టర్స్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచేలా చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి చేయనున్నారు.