నాకు విషం పెట్టి చంపాలని చూశారు: తేజస్వీ యాదవ్ సంచలన విమర్శలు!
- నా ర్యాలీలకు అద్భుత ప్రజా స్పందన
- తట్టుకోలేకపోతున్న నితీశ్ సర్కారు
- విషం పెట్టి చంపాలని చూసింది
- మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తేజస్వీ
తనను చంపాలని చూస్తున్న విషయాన్ని తాను ప్రభుత్వంలోని తనకు విశ్వసనీయంగా ఉండే వర్గాల నుంచి తెలుసుకున్నానని తేజస్వీ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. "ఫోన్ ట్యాపింగ్ తరువాత నాపై హత్యా ప్రయత్నాలు జరిగాయి. నా ర్యాలీలకు వస్తున్న ప్రజలను చూసిన సర్కారుకు భయం వేసి ఈ పని చేయాలని ప్రయత్నించింది" అని ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు.