సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- కేన్స్ ఫెస్టివల్ కి సమంత సినిమా!
- 'ఇది నా లవ్ స్టోరీ' అంటున్న తరుణ్!
- తెలుగులో హిందీ హిట్ సినిమా
- విశాఖ బీచ్ లో రవితేజ షూటింగ్
* తరుణ్ హీరోగా రమేష్ గోపి దర్శకత్వంలో రూపొందిన 'ఇది నా లవ్ స్టోరీ' చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న దీనిని రిలీజ్ చేయనున్నారు.
* హిందీలో హిట్టయిన '2 స్టేట్స్' చిత్రాన్ని అడవి శేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నూతన దర్శకుడు వెంకట్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. ఈ చిత్రం ద్వారా సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా పరిచయమవుతోంది.
* రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'నేల టికెట్' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా విశాఖపట్నంలో జరుగుతోంది. ప్రస్తుతం విశాఖ బీచ్ వద్ద కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో మాళవిక శర్మ నాయికగా నటిస్తోంది.