గడ్డకట్టించే చలిని కూడా లెక్కచేయని బన్నీ!
- వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య'
- సహజత్వం కోసం రిస్క్ చేస్తోన్న బన్నీ
- ఏప్రిల్ 27న అత్యధిక థియేటర్స్ లో రిలీజ్
అయితే స్టూడియోలో సెట్ వేసి చిత్రీకరించడం వలన అనుకున్న ఎఫెక్ట్ రాదనీ, కష్టమైనా సహజంగా ఉండేలా చేద్దామని బన్నీ పట్టుపట్టాడట. దాంతో అక్కడే చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సన్నివేశాలు ఉత్కంఠను పెంచడమే కాకుండా, హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. విశాల్ - శేఖర్ బాణీలను అందించిన ఈ సినిమా నుంచి రెండవ పాటను ఈ నెల 14వ తేదీన వదలనున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 27వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.