త్వరలో 'సవ్యసాచి' అమెరికా ప్రయాణం
- చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి'
- చైతూ జోడీగా నిధి అగర్వాల్
- కీలకమైన పాత్రలో మాధవన్
చైతూ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో, నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో, తమిళ స్టార్ హీరో మాధవన్ ఒక కీలకమైన పాత్రను చేస్తున్నారు. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో చైతూ వున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' చేస్తోన్న సంగతి తెలిసిందే.