భారీ మొత్తం పలికిన 'నా పేరు సూర్య' శాటిలైట్ హక్కులు
- వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య'
- 15 కోట్లకి శాటిలైట్ హక్కులు
- కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్
ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగువారు సొంతం చేసుకున్నారట. ఇందుకోసం వాళ్లు 15 కోట్లను చెల్లించినట్టుగా సమాచారం. గతంలో అల్లు అర్జున్ చేసిన 'దువ్వాడ జగన్నాథం' సినిమా శాటిలైట్ హక్కులను కూడా జీ తెలుగువారే 13 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు 'నా పేరు సూర్య'కు అంతకన్నా ఎక్కువ రేటు పెట్టడం విశేషం.