'ఇప్పుడు ‘బాహుబలి’ గురించి ఎవరైనా చెప్పుకుంటున్నారా?: నటుడు కోట శ్రీనివాసరావు
- ఇప్పటికీ కూడా పాత ‘మాయాబజార్’ గురించి మాట్లాడుకుంటారు
- అలా అని ‘బాహుబలి’ తక్కువని నేను చెప్పట్లేదు
- నాటి దర్శకులు వ్యాపారం చేసినా బాధ్యతగా భావించేవారు
- ఇప్పటివాళ్లలో అది కొరవడిందన్న కోట
అయితే, ‘బాహుబలి’ సినిమా తక్కువని తాను చెప్పట్లేదని.. అద్భుతమైన సినిమా అని, ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకుందనీ ఆయన ప్రశంసించారు. ‘బాహుబలి’ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారని, వాళ్లెవరికీ పేరు రాలేదని, దర్శకుడు రాజమౌళికి మాత్రమే పేరు వచ్చిందని..దీని అర్థం దర్శకుడు గొప్పవాడని, ఈ లెక్కన పాత దర్శకులు ఇంకెంత గొప్పవాళ్లో అని అన్నారు. నాటి దర్శకులు వ్యాపారం చేసినా బాధ్యతగా భావించేవారని, ఇప్పటివాళ్లలో అది కొరవడిందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.