'శైలజా రెడ్డి అల్లుడు' .. సెట్స్ పైకి వచ్చేస్తున్నాడు
- చైతూ హీరోగా షూటింగు దశలో 'సవ్యసాచి'
- మారుతి దర్శకత్వంలో చేయనున్న 'శైలజా రెడ్డి అల్లుడు'
- ఈ నెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్
ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆ రోజున ఈ సినిమా షూటింగును ప్రారంభించి .. నాన్ స్టాప్ గా 20 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారట. హీరో హీరోయిన్స్ మధ్యగల 'ఇగో' సమస్యలపై వినోదభరితంగా ఈ కథను మారుతి సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ కనిపించనుంది.