హీరోయిన్ గా నా కెరియర్ అలా మొదలైంది: కేథరిన్
- అందాల కథానాయికగా కేథరిన్ కి క్రేజ్
- కన్నడలో ఫస్టు సినిమా చేశాను
- ఆ వెంటనే మలయాళంలో చేశాను
- తెలుగులో నీలకంఠగారు ఛాన్స్ ఇచ్చారు
" దుబాయ్ లో పుట్టి పెరిగిన నేను బెంగుళూర్ లో డిగ్రీ చేశాను. అక్కడ చదువుతున్నప్పుడు ఓ కన్నడ సినిమాలో ఛాన్స్ వచ్చింది. సరదాగా చేసి చూద్దామని అంగీకరించాను. 'శంకర్ ఐపీఎస్' అనే ఆ సినిమాలో దునియా విజయ్ హీరో. ఆ సినిమా చేసిన తరువాత, మలయాళ మూవీలో అవకాశం వచ్చింది. దాంతో తెలుగు .. తమిళ సినిమాల్లోను చేయాలనుకున్నాను. అప్పుడు దర్శకుడు నీలకంఠ గారు 'ఛమ్మక్ చల్లో' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ వెంటనే 'పైసా'లో కృష్ణవంశీ గారు అవకాశం ఇచ్చారు" అని చెప్పుకొచ్చారు.