యువరాజుగా కనిపించనున్న చరణ్!
- చరణ్ తదుపరి చిత్రం బోయపాటితో
- రాజస్థాన్ లో ఫస్టు షెడ్యూల్
- కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్
- కీలక పాత్రలో రమ్యకృష్ణ
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాలో చరణ్ రాజవంశస్థుడిగా కనిపించనున్నాడట. అంటే .. యువరాజుగా కొంతసేపు అలరిస్తాడన్న మాట. అందువల్లనే రాజస్థాన్ లోని 'రాజమహల్'లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని అంటున్నారు. ఈ రాజమహల్ లో 30 శాతం చిత్రీకరణను జరపనున్నట్టు సమాచారం. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించనుండగా, ఒక కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుందని చెబుతున్నారు.