మారుతి మూవీలో చైతూ పాత్ర అలా వుంటుందట!
- మారుతి తదుపరి చిత్రంగా 'శైలజా రెడ్డి అల్లుడు'
- కథానాయకుడిగా నాగచైతన్య
- 'ఇగో' కలిగిన వ్యక్తిగా ఆయన పాత్ర
- త్వరలో సెట్స్ పైకి
'కొత్తజంట' సినిమాలో హీరోను స్వార్థపరుడిగా చూపించిన మారుతి, 'భలేభలే మగాడివోయ్' సినిమాలో హీరోని మతిమరుపు కలిగినవాడిగా చూపించి నవ్వులు పూయించాడు. ఆ తరువాత 'మహానుభావుడు'లో హీరోను అతి శుభ్రత కలిగినవాడిగా చూపించి ఆడియన్స్ ను అలరించాడు. ఇక 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాలో హీరోపాత్ర 'ఇగో'తో కూడినదిగా వుంటుందట. ఈ పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.