‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరోయిన్ స్నేహా ఉల్లాల్‌కు 'ఆటో ఇమ్యూన్ డిజార్డర్'.. సినిమాలకు దూరం!
- తెలుగులో పలు సినిమాల్లో నటించిన స్నేహ
- వ్యాధి కారణంగా ఎక్కువ సేపు నిల్చోలేకపోతున్న నటి
- తాజాగా మ్యూజిక్ వీడియో
ప్రస్తుతం ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైంది. రక్త సంబంధిత ‘ఆటో ఇమ్యూన్ డిజార్డర్’తో బాధపడుతున్న స్నేహ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. వ్యాధి కారణంగా ఎక్కువసేపు నిల్చోవడానికి ఇబ్బంది పడుతుండడంతో సినిమాలపై ఆసక్తి చూపడం లేదు. అయితే ఇటీవల వ్యాధి నుంచి కొంత కోలుకున్న ఆమె ‘ఇష్క్ వాలీ బారిష్’ అనే రొమాంటిక్ మ్యూజిక్ వీడియోలో నటించింది.