గోవా నుంచి తిరిగి రానున్న బన్నీ
- గోవాలో 'నా పేరు సూర్య' షూటింగ్
- ఒక పాట .. ఒక ఫైట్ చిత్రీకరణ
- రేపటితో షూటింగ్ పూర్తి
- విశాల్ - శేఖర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. అలాగే అల్లు అర్జున్ .. అనూ ఇమ్మాన్యుయేల్ పై ఒక పాటను కూడా చిత్రీకరించారు. గోవాలోని అందమైన లొకేషన్స్ లో ఈ పాట చిత్రీకరణను పూర్తి చేశారు. రేపటితో అక్కడి షెడ్యూల్ పూర్తి కానుంది. కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకుని .. ఆ తరువాత షెడ్యూల్ ను ప్లాన్ చేస్తారట. విశాల్ - శేఖర్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.