ప్రియుడు మైఖేల్ కోర్సేల్‌ను తండ్రికి పరిచయం చేసిన శ్రుతి హాసన్?
- తమిళ నటుడు అదవ్ పెళ్లికి హాజరైన కమల్ కుటుంబం
- వారితో పాటు మైఖేల్ కూడా
- వైరల్ అవుతున్న ఫొటోలు
అవును... లండన్‌కి చెందిన మైఖేల్ కోర్సేల్, పంచె కట్టులో తమిళ తంబిలా తయారై కమల్ కుటుంబంతో కలిసి నటుడు అదవ్, వినోదినిల వివాహానికి హాజరయ్యారు. అక్కడి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పెళ్లి వేడుకకు రాధిక, ప్రసన్న, ఎ.ఆర్. మురుగదాస్ తదితర సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. వారందరికీ కూడా శ్రుతి, మైఖేల్‌ని పరిచయం చేసి ఉంటుందని గాసిప్ రాయుళ్లు చెవులు కొరుక్కుంటున్నారు.