మొదటి బిట్‌కాయిన్ బిలియనీర్లుగా నిలిచిన కవలలు!
- ఫేస్‌బుక్ ఐడియా తమదేనని గతంలో కేసు వేసిన కేమెరూన్, టేలర్
- నష్టపరిహారం ద్వారా వచ్చిన మొత్తం నుంచి 11 మిలియన్ డాలర్లు బిట్‌కాయిన్‌లో పెట్టుబడి
- ఇటీవల 10,000 శాతానికి పైగా పెరిగిన బిట్‌కాయిన్ విలువ
'జెమినీ' పేరుతో వారొక బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్‌ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో మొదటి డిజిటల్ కరెన్సీ మార్పిడి కేంద్రంగా జెమినీ నిలిచింది. ఇటీవల బిట్‌కాయిన్ విలువ అమాంతం 10,000 శాతానికి పైగా పెరగడంతో మొదటి క్రిప్టోకరెన్సీ బిలియనీర్లుగా వీరు నిలిచారు.