భారీ సెట్లో 'సవ్యసాచి' షూటింగ్ .. మాధవన్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ
- షూటింగు దశలో 'సవ్యసాచి'
- అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్
- హైలైట్ గా నిలవనున్న మాధవన్ పాత్ర
- కథానాయికగా నిధి అగర్వాల్
ఇంతవరకూ చేయని ఒక డిఫరెంట్ రోల్ ను ఆయన ఈ సినిమాలో చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విలక్షణంగా మలచబడిన ఆయన పాత్ర ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది. 'ప్రేమమ్' హిట్ తరువాత చందూ .. చైతూ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.