బాలయ్య సినిమా కన్నా చిరూ సినిమాకి ఎక్కువ పారితోషికం అందుకుంటోన్న నయన్!
- 'జై సింహా' లో బాలకృష్ణ జోడీగా నయన్
- 'సైరా'లో చిరూ సరసన
- భారీగా ముడుతోన్న పారితోషికం
- అందుకే ఆమెకి అంతటి డిమాండ్
గతంలో తాను బాలకృష్ణతో చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడం వలన, ఈ సినిమాకి ఆమె 3 కోట్లు తీసుకుంటోందట. ఇక చిరంజీవితో చేస్తోన్న 'సైరా' సినిమాకి ఎక్కువ రోజులు పనిచేయాల్సి ఉంటుంది కనుక, మూడున్నర కోట్లు అందుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో కొంతమంది కథానాయికలు అందుకునే పారితోషికానికి .. నయన్ పారితోషికం రెండు రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. సీనియర్ హీరోల సరసన చేసే కథానాయికల కొరత ఉండటం .. ఉన్నవాళ్లలో నయనతారకి రెండు భాషల్లోను ఎక్కువగా క్రేజ్ ఉండటం ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.