అందరి దృష్టి నిధి అగర్వాల్ పైనే!
- 'మున్నా మైఖేల్' లో మెరిసిన నిధి అగర్వాల్
- 'సావ్యసాచి'లో కథానాయికగా ఛాన్స్
- ఆమె గ్లామర్ కి ఫుల్ మార్క్స్
- స్టార్ హీరోయిన్ అవుతుందంటూ అభిప్రాయాలు
అందువలన యూత్ లో ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. 'సవ్యసాచి'లో ఈ అమ్మాయి చేయనుందని తెలియగానే అందరిదృష్టి ఆ వైపు మళ్లింది. దాంతో మిగతా దర్శక నిర్మాతల దృష్టి సహజంగానే నిధి అగర్వాల్ పై పడింది. దాంతో తమ సినిమాల్లో కథానాయికగా ఆమెను తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక కొంతమంది హీరోలు కథానాయికగా ఆమెకి ఛాన్స్ ఇవ్వడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారట. భవిష్యత్తులో ఈ అమ్మాయి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉండటం విశేషం.