ఆ దృశ్యాలు తొలగించమని దర్శకుడిని కోరుతున్నా: హీరోయిన్ అతుల్య
- 'ఏమాలి' చిత్రంలో నటించిన అతుల్య
- టీజర్ లో అందాల ఆరబోత
- మండిపడుతున్న నెటిజన్లు
ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో ఉన్న డైలాగ్స్, సీన్లు నెట్టింట వైరల్ గా మారాయి. హీరోయిన్ అతుల్య కురచ దుస్తులు ధరించి అందాలను ఆరబోయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతుల్యపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో అతుల్య స్పందించింది. టీజర్ లో ఉన్న సీన్లను చూసి తప్పుగా అర్థం చేసుకోవద్దని... తను పోషించింది చాలా మంచి విషయాలను చెప్పే పాత్ర అని ఫేస్ బుక్ లో తెలిపింది. అయితే, టీజర్ లో ఉన్న సీన్లు తనకు కూడా బాధగా అనిపించాయని... వాటిని తొలగించాల్సిందిగా దర్శకుడిని కోరుకుంటున్నానని చెప్పింది.