దర్శకుడిగా మారుతోన్న కెమెరామెన్ .. హీరోగా నాగశౌర్య
- మెగాఫోన్ పడుతోన్న కెమెరామెన్
- హీరోగా నాగశౌర్య
- సంగీత దర్శకుడిగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ 'రధన్'
- త్వరలోనే సెట్స్ పైకి
పిల్లజమీందార్ .. గీతాంజలి .. ఎక్కడికిపోతావు చిన్నవాడా .. సుప్రీమ్ వంటి పలు హిట్ చిత్రాలకి కెమెరామెన్ గా ఆయన పనిచేశారు. ఇక దర్శకుడిగా తన సత్తా చాటడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా కోసం హీరోగా ఆయన నాగశౌర్యను ఎంచుకున్నారు. ' అందాల రాక్షసి' .. 'అర్జున్ రెడ్డి' వంటి సినిమాలకి సంగీతాన్ని అందించి మంచి పేరు తెచ్చుకున్న 'రధన్' .. ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.