మరోసారి వాన పాటలో అలరించనున్న తమన్నా
- జయేంద్ర దర్శకత్వంలో కల్యాణ్ రామ్ మూవీ
- కల్యాణ్ రామ్ జోడీగా తమన్నా
- వేగంగా కొనసాగుతోన్న షూటింగ్
- తమన్నా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ
ఈ సినిమాకి ఈ వాన పాట హైలైట్ గా నిలవడం ఖాయమని అంటున్నారు. గతంలో తమన్నా 'బద్రీనాథ్' .. 'రచ్చ' సినిమాల్లో చేసిన వాన పాటలు కుర్రకారుకు గిలిగింతలు పెట్టాయి. ఆ పాటలలో మెరిసిన తమన్నా అందాలను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి హుషారైన వాన పాటతో మరోసారి ఆడియన్స్ ను తమన్నా అలరించడం ఖాయమనే మాట వినబడుతోంది.