'సవ్యసాచి'తో తెలుగు తెరకి కొత్త హీరోయిన్!
- ఈ నెల 3వ వారం నుంచి సెట్స్ పైకి 'సవ్యసాచి'
- విభిన్నమైన కాన్సెప్ట్ ను ఎంచుకున్న చందూ మొండేటి
- కథానాయికగా నిధి అగర్వాల్
- తెలుగులో ఇదే మొదటి సినిమా
టైగర్ ష్రాఫ్ జోడీగా 'మున్నా మైఖేల్' అనే బాలీవుడ్ మూవీతో నిధి అగర్వాల్ వెండితెరకి పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, అమ్మడి గ్లామర్ కి హండ్రెడ్ మార్కులు పడిపోయాయి. దాంతో ఇతర భాషల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 'సవ్యసాచి' సినిమాను అంగీకరించింది. మాధవన్ కీలకమైన పాత్రను పోషించే ఈ సినిమా, ఈ నెల 3వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.