గ్లామర్ ఒలకబోసే పాత్రలకి దూరంగానే ఉంటాను : నిఖిలా విమల్
ఈ సినిమా దర్శకుడు ప్రజీత్ మలయాళీ అనీ .. ఆయనతో గల పరిచయం కారణంగానే ఈ సినిమాకి ఓకే చెప్పానని అంది. అల్లరి నరేష్ తో పరిచయమైన తరువాతనే ఆయన సినిమాలు చూశాననీ, ఆయన ఎంత మంచి నటుడో తెలిసిందని చెప్పింది. గ్లామర్ ఒలకబోసే పాత్రలకి దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాననీ, అందంగా కనిపిస్తూ .. నటనకి ప్రాధాన్యమున్న పాత్రలను చేయడానికి తాను ఆసక్తిని చూపుతానని చెప్పుకొచ్చింది. మరోపక్క, 'గాయత్రి' సినిమాలో ఈ అమ్మాయి మోహన్ బాబుకి కూతురుగా చేస్తుండటం విశేషం.