బాలకృష్ణ మూవీ కోసం నయనతారతో పాటు మరో కొత్త హీరోయిన్!
ఇక రెండవ కథానాయికగా 'నటాషా దోషి'ని ఎంపిక చేసినట్టుగా సమాచారం. కథానాయికగా నటాషా దోషికి మలయాళంలో మంచి గుర్తింపు వుంది. 'హైడ్ అండ్ సీక్' .. 'మాంత్రికన్' .. 'నయన' .. 'కాల్ మీ @' .. 'ఫర్ సెల్' వంటి సినిమాలు ఆమెకి ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టాయి. బాలకృష్ణ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. ఇక మూడవ కథానాయికగా ఎవరిని తీసుకుంటారో చూడాలి.