మారుతి నెక్స్ట్ మూవీలో హీరో చైతూ!
చైతూ తాజా చిత్రంగా వచ్చేనెల 8వ తేదీన 'యుద్ధం శరణం' విడుదల కానుంది. ఆ తరువాత ఆయన 'సవ్యసాచి' సినిమాపై పూర్తి దృష్టి పెట్టనున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మారుతితో కలిసి సెట్స్ పైకి వెళ్లొచ్చని అంటున్నారు. గతంలో మారుతి చేసిన 'బాబు బంగారం' సినిమాకి .. చైతూ చేసిన 'ప్రేమమ్' మూవీకి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇదే బ్యానర్ ఇప్పుడు ఈ కాంబినేషన్లోని మూవీని నిర్మించనుందని సమాచారం.