'జై లవ కుశ' కోసం తమన్నా స్పెషల్ సాంగ్!
ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండటంతో, తమన్నాతో చేయిస్తే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారట. తమన్నా ఎంత మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసిందని అంటున్నారు. ఇందుకోసం ఆమె భారీ మొత్తమే పారితోషికంగా అందుకోనుందని వినికిడి. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి వుంది. 'జనతా గ్యారేజ్' లో "పక్కాలోకల్ .. "అనే స్పెషల్ సాంగ్ మాదిరిగానే ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని యూనిట్ చెబుతోంది.