'మహానటి' మూవీలోకి ప్రకాశ్ రాజ్ ఎంట్రీ!
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. నిర్మాత చక్రపాణిగారి పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు. సావిత్రి కెరియర్ ఆరంభంలో ఆమెలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన వారిలో చక్రపాణిగారు ముఖ్యులు. ఆ పాత్రకి ప్రకాశ్ రాజ్ సరైన న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఆయనను తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రను సమంతా చేస్తున్న సంగతి తెలిసిందే.