ఇక ఆగేది లేదంటూ వెబ్ సిరీస్ లోకి ధనుష్ !
ఈ లోగా తన దర్శకత్వంలో వచ్చిన 'పా పాండి' హిట్ కావడంతో తనపై తనకి మరింత నమ్మకం పెరిగిందట. దాంతో వెబ్ సిరీస్ ను మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఒక రచయితల బృందాన్ని ఏర్పాటు చేసుకుని, వాళ్ల నుంచి మంచి కంటెంట్ ను రాబట్టే ప్రయత్నంలో వున్నాడట. వచ్చే ఏడాది ఇది కార్యరూపం దాల్చవచ్చని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ధనుష్ నటించడట .. దర్శకత్వం మాత్రమే చేస్తాడట.