'ఉయ్యాలవాడ' పట్ల ఆసక్తిని చూపిన అమితాబ్?
చారిత్రక నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. ఈ సినిమాను జాతీయస్థాయిలో విడుదల చేసే ఆలోచన వుంది కనుక, ఈ పాత్రను అమితాబ్ తో చేయిస్తే బాగుంటుందని చిరంజీవి తలిచారు. ఈ విషయంపై అమితాబ్ ను సంప్రదించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమా కథ .. తన పాత్ర నచ్చడంతో అమితాబ్ సుముఖతను వ్యక్తం చేసినట్టుగా తాజా సమాచారం. మెగాస్టార్ రిక్వెస్ట్ చేయడం .. చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడం వలన, అమితాబ్ ఆసక్తిని చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.