సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా 'సువర్ణ సుందరి'
1509లో మొదలయ్యే ఈ కథ 2017 వరకూ కొనసాగుతుంది. నాలుగు దశాబ్దాలకి సంబంధించిన కథను ఆవిష్కరించే ఈ సినిమాలో పూర్ణ ప్రధానమైన పాత్రను పోషించింది. 'అరుంధతి' మూవీ అనుష్కకి ఎంతటి క్రేజ్ ను తెచ్చిపెట్టిందో .. ఈ సినిమా పూర్ణకి అంతటి పేరును తీసుకువస్తుందని చెబుతున్నారు. త్వరలోనే టీజర్ ను వదలనున్నామనీ .. విడుదల తేదీని తెలియజేస్తామని అన్నారు.