'ఉయ్యాలవాడ' పై చిరూ బలమైన నిర్ణయం!
ఈ సినిమాలో కథానాయికలుగా ఐశ్వర్య రాయ్ .. సోనాక్షి సిన్హా .. నయనతార పేర్లు వినిపిస్తున్నాయి. కథా పరంగాను .. టెక్నికల్ గాను ఇది భారీ సినిమా. అందువలన చిత్రీకరణకు చాలా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం వుంది. అందువలన అంతా పక్కాగా రెడీ చేసుకుని షూటింగ్ మొదలు పెట్టాలని చిరంజీవి భావిస్తున్నారట. రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లిన తరువాత పెద్దగా గ్యాప్ లేకుండా చకచకా పనులు పూర్తి కావాలని చెప్పారట. వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు రావాలనే బలమైన నిర్ణయాన్ని యూనిట్ వారికి చెప్పేశారని తెలుస్తోంది.