పుణ్యరాశిని పెంచే కార్తీకం
కార్తీక బహుళ నవమి రోజున నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి, ముత్తయిదువులకు వస్త్రంతో పాటు పసుపు - కుంకుమ ఇవ్వాలి. కార్తీక బహుళ దశమి రోజున శివాలయాలలో లలితా సహస్రనామ పారాయణ చేసి .. అన్నదానం చేయాలి. కార్తీక బహుళ ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాలను దర్శించాలి. విష్ణు సహస్రనామం పఠించి .. పప్పులు దానంగా ఇవ్వాలి. కార్తీక బహుళ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఆరాధించి .. బ్రాహ్మణుడికి స్వయం పాకం .. 'భాగవత గ్రంధం' దానంగా ఇవ్వాలి.
కార్తీక బహుళ త్రయోదశి రోజున శివుడికి అభిషేకం చేసి .. నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. కార్తీక బహుళ చతుర్దశి రోజున శివాలయ దర్శనం చేసి .. శివుడికి అభిషేకం చేయించాలి. శివలింగం .. విభూతి పండును దానంగా ఇవ్వాలి. ఇక కార్తీక బహుళ అమావాస్య రోజున శివుడికి రుద్రాభిషేకం చేయాలి. ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. ఈ విధంగా కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధించడం వలన .. శక్తి కొలది దానధర్మాలు చేయడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.