శివుడు కోడి రూపాన్ని ధరించిన క్షేత్రం

శివమ్ అంటే మంగళం అని అర్థం .. శుభాలను ప్రసాదించువాడే శంకరుడు. శివ నామ స్మరణ వలన .. శివ పూజ వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి పరమశివుడు తన లీలా విశేషాలలో భాగంగా ఎన్నో ప్రదేశాలలో ఆవిర్భవించాడు .. వాటిలో 'పిఠాపురం' ఒకటి.

 సదా శివుడిని ఇక్కడ 'కుక్కుటేశ్వర స్వామి'గా పూజిస్తుంటారు. 'పిఠాపురం' అమ్మవారి శక్తి పీఠంగానే కాదు, స్వామివారు 'కోడి' రూపాన్ని ధరించిన క్షేత్రంగాను చెబుతారు. గయాసురుడిని సంహరించడం కోసం త్రిమూర్తులు పథక రచన చేస్తారు. అందులోభాగంగా తెల్లవారక మునుపే గయాసురుడు మేల్కొనాలి. అలా జరగడం కోసం శివుడు 'కోడి' రూపాన్ని ధరించి కూస్తాడు. తెల్లవారిందనుకుని మేల్కొన్న గయాసురుడిని సంహరిస్తాడు. ఆ రాక్షసుడి కోరిక మేరకు స్వామి లింగ రూపంలో అక్కడే వెలిశాడు. అందుకే ఇక్కడి స్వామిని 'కుక్కుటేశ్వరుడు' గా ఆరాధిస్తూ వుంటారు.       


More Bhakti News