మంచి నిద్ర పట్టాలంటే ఆహారంలో ఈ మార్పులు అవసరం
- కాఫీ, టీలను సాయంత్రం తర్వాత తీసుకోవద్దు
- ఆల్కహాల్ ను చాలా తక్కువ పరిమాణానికే పరిమితం చేయాలి
- రాత్రి తేలిక పాటి ఆహారాన్ని అలవాటు చేసుకోవాలి
కంటి నిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. మన శరీరం తిరిగి నూతన శక్తిని సంతరించుకునేందుకు నిద్ర ప్రధానం. మరి చక్కటి నిద్ర అందరికీ సాధ్యం కాకపోవచ్చు. నిద్ర నాణ్యత పెంచుకునేందుకు రోజువారీ జీవనంలో కొన్ని మార్పులు చేసుకోక తప్పదు. ముఖ్యంగా ఆహారంలో కొన్ని జాగ్రత్తలు, మార్పులు చేసుకోవాలి.
కాఫీ, టీలను సాయంత్రం 4 గంటల తర్వాత తాగకూడదు. కెఫైన్ అన్నది నిద్ర భావనను పోగొడుతుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది. అందుకనే వీటికి దూరంగా ఉండాలి. సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కూడా సాయంత్రం తర్వాత తీసుకోవద్దు.
ఆల్కహాల్ అలవాటు ఉన్న వారు దాన్ని చాలా కనిష్ఠ పరిమాణానికి తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆల్కహాల్ ఎక్కువ తాగితే మత్తు అనిపిస్తుంది. కానీ, తర్వాత నిద్ర స్థాయులను ఇది ప్రభావితం చేస్తుంది. అందుకని చాలా తక్కువ మోతాదుకే ఆల్కహాల్ ను పరిమితం చేసుకోవాలి.
ట్రిప్టోఫాన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇది సెరటోనిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇదొక న్యూరో ట్రాన్స్ మీటర్. పాలు, గుడ్లు, నట్స్ లో ఉంటుంది. రోజంతా శరీరంలో నీరు తగినంత ఉండడం కూడా నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. నిద్రకు ముందు చమోమిలే టీ తాగొచ్చు.
పడుకోవడానికి ముందు కడుపునిండా భోజనం తీసుకోవద్దు. రాత్రి వేళ తేలికపాటి ఆహారం వల్లే మంచి నిద్ర సాధ్యపడుతుంది. అలాగే, రాత్రి వేళ కారం, ఉప్పును దట్టించే స్పైసీ ఫుడ్స్ తీసుకోవద్దు.