ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త
- వేతన, ఉద్యోగ విరమణ చెల్లింపులు జరపాలని నిర్ణయం
- సీనియారిటీ ప్రాతిపదికన చెల్లింపులు
- ఏప్రిల్ 30 నాటికి చెల్లింపుల ప్రక్రియ పూర్తి
- 5,027 మంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ది
ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) రిటైర్డ్ ఉద్యోగులకు సీఎం జగన్ సర్కారు తీపి కబురు చెప్పింది. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు వేతన, ఉద్యోగ విరమణ ప్రయోజనాలన్నీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీనియారిటీ ప్రాతిపదికన చెల్లింపులు చేస్తామని, ఏప్రిల్ 30 నాటికి అన్ని చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం ద్వారా 5,027 మంది ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు లబ్ది పొందుతారని వివరించింది. 2017-19 మధ్య కాలంలో గత ప్రభుత్వం రూ.146.04 కోట్ల మేర బకాయిలు పెట్టిందని ఆరోపించింది.