గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి: శోభిత ధూళిపాళ

Sobhita Dhulipala says I want to forget my past completely
  • మీ జీవితంలో ఏ విషయాన్ని మర్చిపోవాలనుకుంటున్నారంటూ శోభితకు ప్రశ్న
  • నిన్నటి వరకు తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని మర్చిపోవాలనుకుంటున్నానన్న శోభిత
  • చేదు జ్ఞాపకాలను మర్చిపోయినప్పుడే ఫ్రీగా ముందుకు సాగుతామని వ్యాఖ్య

అక్కినేని నాగచైతన్యతో వివాహం జరిగిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన శోభిత ధూళిపాళ.. రీసెంట్‌గా ‘చీకటిలో’ వెబ్‌సిరీస్‌తో డిజిటల్ స్క్రీన్‌పై మంచి థ్రిల్ ఇచ్చారు. ప్రస్తుతం కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘వెట్టువం’ షూటింగ్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ... తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన కొన్ని పర్సనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీశాయి.


ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ శోభితను ఒక పర్సనల్ క్వశ్చన్ అడిగారు. "మీ లైఫ్‌లో ఏ విషయాన్ని పూర్తిగా మర్చిపోవాలని అనుకుంటున్నారు?" అని ప్రశ్నించగా... దానికి శోభిత ఏమాత్రం తడబడకుండా.. "నిన్నటి వరకు నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను, జ్ఞాపకాన్ని పూర్తిగా మర్చిపోవాలని అనుకుంటున్నాను" అని ఆన్సర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.


తన సమాధానానికి గల కారణాన్ని వివరిస్తూ.. "సాధారణంగా లోకం మతిమరుపును ఒక జబ్బుగా చూస్తుంది. కానీ నా దృష్టిలో కొన్నిసార్లు మతిమరుపు అనేది మనిషికి దొరికే ఒక గొప్ప వరం. ఎందుకంటే లైఫ్‌లో వేరే వాళ్లు మన పట్ల చేసిన బాధాకరమైన పనులు, మన మనసును గాయపరిచిన చేదు జ్ఞాపకాలను మనం మర్చిపోయినప్పుడే జీవితంలో ఫ్రీగా ముందుకు సాగడం సాధ్యమవుతుంది" అని చెప్పుకొచ్చారు. పాత జ్ఞాపకాలలోనే ఎప్పుడూ కూరుకుపోకుండా, వాటన్నింటినీ డిలీట్ చేసేసి రేపటి భవిష్యత్తు గురించి పాజిటివ్‌గా ఆలోచించడమే నేటి అవసరమని శోభిత క్లారిటీ ఇచ్చారు.

Go Back to Shorts
Sobhita Dhulipala
Naga Chaitanya
Sobhita Dhulipala Interview
Vettuvam Movie
Sobhita Dhulipala News
Sobhita Dhulipala Past Comments

More Telugu News