ఏపీలో రేర్ ఎర్త్ హబ్.. రష్యా సంస్థతో మాస్కోలో మంత్రి లోకేష్ కీలక భేటీ

Rare Earth Hub in AP Minister Lokesh key meeting with Russian firm in Moscow
  • మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ 'గిరెడ్‌మెట్'తో మంత్రి నారా లోకేష్ భేటీ
  • ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ రిఫైనింగ్ హబ్ ఏర్పాటుకు ప్రతిపాదన
  • నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ల తయారీ కేంద్రంపై చర్చలు
  • భారత ఈవీ, పవన విద్యుత్ మార్కెట్లే లక్ష్యంగా ప్రాజెక్టులు
  • మాస్కోలోని అణుశక్తి మ్యూజియాన్ని సందర్శించిన లోకేష్
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రష్యాలో పర్యటిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, మాస్కోలో కీలక సమావేశంలో పాల్గొన్నారు. రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ ఖనిజాల సంస్థ 'గిరెడ్‌మెట్ ఇనిస్టిట్యూట్' ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు గల అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో లభించే భారీ ఖనిజ వనరులను ఉపయోగించుకుని, ఒక డీప్ ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ ఎలిమెంట్ (ఆర్ఈఈ) రిఫైనింగ్ హబ్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. అలాగే, భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), పవన విద్యుత్ మార్కెట్ల అవసరాలను తీర్చేందుకు గిరెడ్‌మెట్ సాంకేతికతతో నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పేందుకు భాగస్వామ్యం కావాలని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, "విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్న భారీ ఖనిజ వనరులను ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ & రేర్ ఎర్త్ ఎలిమెంట్ (ఆర్ఈఈ) రిఫైనింగ్ హబ్ ఏర్పాటుకు, నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు భాగస్వామ్యం వహించాలని కోరాను" అని తెలిపారు.

మాస్కోలోని అతిపెద్ద అణుశక్తి మ్యూజియాన్ని కూడా లోకేష్ సందర్శించారు. ఈ పర్యటన తనకు ఒక ప్రత్యేక అనుభూతినిచ్చిందని, విజ్ఞానం, చరిత్ర, సాంకేతికతల సమన్వయ వేదికగా ఈ మ్యూజియం నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

Go Back to Shorts
Nara Lokesh
Giredmet Institute
Rare Earth Hub Andhra Pradesh
Andhra Pradesh Russia Investment
Neodymium Magnet Production Nellore
Visakhapatnam Srikakulam Rare Earth

More Telugu News