నాగచైతన్య అనుమతి లేకుండా ఆయన ఫొటోలు, వీడియోలు వాడొద్దు: ఢిల్లీ హైకోర్టు
- తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు వాడుకుంటున్నారంటూ నాగచైతన్య పిటిషన్
- తన హక్కులను కాపాడాలని కోరిన చైతూ
- చైతూ విన్నపంపై సానుకూలంగా స్పందించిన కోర్టు
నాగచైతన్య అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. నాగచైతన్య అనుమతి లేకుండా ఆయన పేరు, ముఖ రూపం, స్వరాన్ని వాణిజ్యపరంగా వాడకూడదని తీర్పును వెలువరించింది. నాగచైతన్య వ్యక్తిగత హక్కులను పరిరక్షిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలువురు సినీ స్టార్లు ఢిల్లీ హైకోర్టు నుంచి ఇదే రకమైన రక్షణ పొందిన సంగతి తెలిసిందే.