చంద్రబాబు బూట్లు ఎప్పుడు తుడుస్తావ్?: కొడాలి నానికి వెనిగండ్ల రాము ప్రశ్న
- 53 వేల ఓట్లతో ఓడిపోయినా నానికి బుద్ధి రాలేదన్న వెనిగండ్ల రాము
- గుడివాడ ప్రజలు నానిని ఎప్పుడో మర్చిపోయారని ఎద్దేవా
- సిగ్గు, శరం లేకుండా విమర్శలు చేస్తున్నాడని మండిపాటు
గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నానిని గుడివాడ ప్రజలు 53 వేల ఓట్లతో చిత్తుగా ఓడించారని... అయినా ఆయనకు బుద్ధి రాలేదని రాము అన్నారు. విజయవాడలో మీడియా ముందు మాట్లాడటం కాదని... దమ్ముంటే గుడివాడలో అడుగు పెట్టాలని సవాల్ విసిరారు. గుడివాడలో నాని సీటు గల్లంతయిందని... అసలు ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అని చెప్పారు. గుడివాడ ప్రజలు నానిని ఎప్పుడో మర్చిపోయారని అన్నారు. జనాలు ఛీ కొడుతున్నా కొడాలి నాని సిగ్గు, శరం లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కొడాలి నాని... చంద్రబాబు బూట్లు ఎప్పుడు తుడుస్తావో చెప్పు అని ప్రశ్నించారు. గుడివాడ రాజకీయాలపైనే పట్టు లేని కొడాలి నానికి రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడటం అవసరమా? అని ఎద్దేవా చేశారు.