వెల్‌డన్ వైభవ్.. యువ సంచలనాన్ని అభినందించిన కావ్య మారన్.. వీడియో వైరల్!
- ఐపీఎల్ ఎలిమినేటర్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
- 29 బంతుల్లో 97 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్
- మ్యాచ్ అనంతరం వైభవ్‌ను ప్రత్యేకంగా అభినందించిన కావ్య మారన్
- ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
- వైభవ్ అరుదైన టాలెంట్ అంటూ కితాబిచ్చిన ఎస్‌ఆర్‌హెచ్ కోచ్
మ్యాచ్ అనంతరం కావ్య మారన్ స్వయంగా వైభవ్ వద్దకు వెళ్లి అతడిని ప్రత్యేకంగా అభినందించారు. యువ ఆటగాడితో కరచాలనం చేసి, ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యర్థి జట్టు ఆటగాడిని ప్రోత్సహించిన కావ్య తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇలాంటి టాలెంట్‌ను చూడలేదు: జేమ్స్ ఫ్రాంక్లిన్
మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ అసిస్టెంట్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ సైతం వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ అనంతరం ఫ్రాంక్లిన్ మాట్లాడుతూ.. "బహుశా ఇలాంటి టాలెంట్‌ను ఎవరూ చూసి ఉండరు. అతను చేస్తున్నది నమ్మశక్యంగా లేదు. అతనికి ఇంకా 25 ఏళ్ల కెరీర్ మిగిలి ఉందని ఊహించుకుంటేనే భయంగా ఉంది. భవిష్యత్తులో అతను మరింత మెరుగవుతాడు. మరింత బలంగా తయారవుతాడు" అని చెప్పుకొచ్చాడు.