చిరంజీవితో నిర్మాతల సమావేశంపై సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు
- వాటాలు పంచుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారా? అని నారాయణ ప్రశ్న
- టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలను తప్పుబట్టిన వైనం
- సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శ
ఇష్టానుసారం టికెట్ రేట్లను పెంచడం, బెనిఫిట్ షోలను నిర్వహించడాన్ని నారాయణ తప్పుబట్టారు. భారీ చిత్రాల బడ్జెట్లను చూపుతూ టికెట్ ధరల పెంపుకు, బెనిఫిట్ షోలకు నిర్మాతలు పదేపదే అనుమతులు కోరుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు కూడా అడగ్గానే అనుమతులు మంజూరు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ మొత్తం వ్యవహారం చివరకు సామాన్య కుటుంబాలపై భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా టికెట్ ధరలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని చెప్పారు. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల వద్ద ఇప్పటికీ ఎలాంటి పాలసీ లేదని విమర్శించారు. ఇష్టానుసారం టికెట్ రేట్లను పెంచుతూ సామాన్య ప్రేక్షకులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.