నిన్నటి విధ్వంసకర ఇన్నింగ్స్ తర్వాత.. సోషల్ మీడియాలో వైభవ్ మూడు పదాల సందేశం
- ఐపీఎల్ ఎలిమినేటర్‌లో చెలరేగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
- 29 బంతుల్లో 97 పరుగులతో రాజస్థాన్‌కు ఒంటిచేత్తో విజయం
- సన్‌రైజర్స్‌పై గెలుపుతో క్వాలిఫయర్ 2కు చేరిన రాయల్స్
- ఇంకా ఆకలి తీరలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువ సంచలనం
ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకుంటుంది. మ్యాచ్ అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్‌లో వైభవ్.. 'ఇంకా కావాలనే ఆకలి' (Hungry for more) అంటూ మూడు పదాల సందేశంతో తన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాడు.
వైభవ్ ఆటతీరు, పరిణతిపై ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం
వైభవ్ అద్భుత ప్రదర్శనపై దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. "కేవలం 15 ఏళ్ల వయసులో ఇంతటి ఆట అవగాహన, పరిణతి చూపడం అసాధారణం" అని కొనియాడాడు. ఒత్తిడితో కూడిన నాకౌట్ మ్యాచ్‌లో అద్భుతమైన షాట్ సెలక్షన్‌తో పాటు వైభవ్ చూపిన ప్రశాంతత తనను ఎంతగానో ఆకట్టుకుందని డి విలియర్స్ జియోస్టార్‌తో అన్నాడు.