ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చెరిగిపోదు’: ఎన్టీఆర్ జయంతి వేళ చిరు భావోద్వేగ పోస్ట్
- ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
- సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌ను స్మరించుకున్న చిరంజీవి
- తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడిన చిరు
- ఆయనతో ఉన్న అరుదైన ఫొటోను పంచుకున్న మెగాస్టార్
- ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకోవడంపై ప్రత్యేకంగా ప్రస్తావన
ఈ సందర్భంగా చిరంజీవి తన పోస్ట్‌లో.. “ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు. తెరపై అనేక పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా.. ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా.. అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులు. ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నాకు లభించడం కూడా ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకు ఉన్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది. ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ..” అని తన నివాళిని అర్పించారు.