‘సూర్యుడు ఎరుగని కొత్త కాంతి’ అంటున్న ఆనంద్ దేవరకొండ.. ‘ఎపిక్’ నుంచి మెలోడీ పాట విడుదల
- ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య సరికొత్త చిత్రం ‘ఎపిక్’
- ‘#90s’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపకల్పన
- ‘ప్రియసఖి’ అంటూ సాగే పాట విడుదల
- కేఎస్ హరిశంకర్ ఆలపించిన బ్యూటిఫుల్ మెలోడీ
- లిరిక్స్ అందించిన సురేశ్ బానిశెట్టి
‘ప్రియసఖి..’ అంటూ సాగే కొత్త మెలోడియస్ సాంగ్‌ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. ఈ రొమాంటిక్ ట్రాక్‌కు సురేశ్ బానిశెట్టి లిరిక్స్ అందించగా.. ప్రముఖ సింగర్ కేఎస్ హరిశంకర్ తన గాత్రంతో ప్రాణం పోశారు. ‘నా జీవితాన్ని మార్చేశావే బుజ్జి నెమలి.. నాకు స్వర్గాన్ని చూపించావే పూల కడలి’ అంటూ ఆనంద్ దేవరకొండ హీరోయిన్‌ను రిక్వెస్ట్ చేసే లైన్స్ ఈ పాటలో హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమా టీజర్‌ను గతనెల విడుదల చేశారు.