ఓటీటీలో మరాఠీ మిస్టరీ థ్రిల్లర్!
- మరాఠీలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్
- ఏప్రిల్ 17న విడుదలైన సినిమా
- ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్
- కన్నడలో మాత్రమే అందుబాటులో ఉన్న కంటెంట్
అది ఆధునిక ప్రపంచానికి చాలా దూరంగా ఉండే ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామానికి చెందిన పదేళ్ల పిల్లలు అదృశ్యమవుతూ ఉంటారు. అలా కనిపించకుండా పోయిన పిల్లలు, ఆ తరువాత శవాలుగా దొరుకుతూ ఉంటారు. దాంతో చీకటిపడితే తమ పిల్లలను బయటికి పంపించడానికి తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. అందరూ కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉంటారు.
ఈ నేపథ్యంలో ఈ కేసును పరిష్కరించడం కోసం స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా 'మనోరమ' అక్కడికి వస్తుంది. తనదైన స్టైల్లో అన్ని కోణాలలో సమస్య మూలలను పరిశీలిస్తూ ముందుకు వెళుతుంది. అప్పుడు ఆమెకి తెలిసే నిజాలేమిటి? పిల్లల మరణాలకు కారకులు ఎవరు? వాళ్లు అలా చేయడంలోని ఉద్దేశం ఏమిటి? అనేది కథ.