ఓటీటీ ఆడియన్స్ ను కట్టిపడేస్తున్న కన్నడ క్రైమ్ థ్రిల్లర్!
- కన్నడలో రూపొందిన 'హయగ్రీవ'
- పురాణాలతో ముడిపడిన క్రైమ్ థ్రిల్లర్
- ఫిబ్రవరి 27న విడుదలైన సినిమా
- ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్
- తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్
ప్రస్తుతం ఈ సినిమా కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. అయినా ఈ కంటెంట్ దూసుకు పోతుండటం విశేషం. శ్రీమహావిష్ణువు గుర్రం తలను ధరించి హయగ్రీవుడిగా మారడం వంటి సన్నివేశాలతో ఈ కథ మొదలై, ఆ తరువాత ప్రస్తుత కాలంలో కొనసాగుతుంది. ఈ రెండు కాలాలకు ఈ కథను ముడిపెట్టిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. సంజనా ఆనంద్ .. సాధు కోకిల .. రంగాయన రఘు .. శరత్ లోహితస్య ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
అర్జున్ హయగ్రీవ ఒక పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. అదే సమయంలో నగరంలో వరుస హత్యలు జరుగుతూ వెళుతుంటాయి. హంతకుడిని వెతుకుతూ ఉండగానే, మరికొన్ని హత్యలు జరుగుతుంటాయి. హంతకుడు హత్యలు చేసే విధానంపై అధ్యయనం చేసిన అర్జున్ హయగ్రీవకి ఒక నిజం తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? దాని పర్యవసాలు ఎలా ఉంటాయి? అనేది కథ. విజువల్స్ .. నేపథ్య సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. తెలుగు ఆడియో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.